ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి దీపిక ఔట్..

ఇటీవలే తల్లి అయిన దీపిక, ప్రస్తుతం తన బిడ్డకు దూరంగా ఉండకూడదని భావించి సినిమాలకు బ్రేక్ ఇచ్చిందట. అంతేకాదు, కథపై కొన్ని క్రియేటివ్ డిఫరెన్సులు కూడా ఉన్నట్లు సమాచారం. దీపిక కండీషన్స్(Conditions) నచ్చక సందీప్ ఆమెను కాదన్నారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ, ఇప్పుడు ఈ చిత్రానికి కొత్త హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సినీ వర్గాల సమాచారం.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్

ఇప్పటికే ఈ సినిమాకు ‘SPIRIT’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అలాగే, ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె(Deepika Padukone)ను ఎంపిక చేశారని పలు వార్తలు వచ్చాయి. దీపికా ఈ సినిమాకు రూ. 20 కోట్లు రెమ్యునరేషన్(Remunaration) తీసుకుంటున్నట్లు కూడా బోలెడన్ని రూమర్స్ వినిపించాయి.

‘అర్జున్ రెడ్డి(Arjun Reddy)’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). ఇటీవల రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా తెరకెక్కించిన ‘Animal’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాన్ని సాధించారు. ఇలా అనతి కాలంలోనే భారీ క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు సందీప్.. మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధమవుతున్నారు. తన తదుపరి సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)తో జట్టు కట్టారు.

Related Posts

కోటి రూపాయల చెట్టు..! ఆ చెట్టుకు డార్లింగ్ కు లింక్ ఏమిటి?

Share Tweet Pin Send పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్…

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అదిరే బిజినెస్.. ఏడాదికి కోట్లలలొ లాభం!

Share Tweet Pin Send టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో నెగటివ్ షేడ్స్‌తో ను ప్రారంభించిన సందీప్ కిషన్, తన కష్టంతో నెమ్మదిగా హీరోగా స్థిరపడ్డాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన హిట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *