Chiranjeevi: చిరంజీవి ఇంటికి రావద్దన్న కుటుంబ సభ్యులు

1978లో పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు చిరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ ముందుగు దూసుకెళ్తున్నడు మెగాస్టార్. సాధారణ కుటుంబం నుండి వచ్చి సినీ రంగంలో అడుగు పెట్టిన చిరూ.. నేషనల్ లెవెల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్‌ వరకు గట్టి పోటీ ఇస్తూ తన సత్తా ఏంటో చూపించాడు.

తన సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించాడు. వాటిలో ఆయన పోషించిన ప్రత్యేకమైన పాత్ర లేడీ గెటప్. అవును మెగాస్టార్ చిరు జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి సినిమాలో లేడీ గెటప్ వేశాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అప్పట్లో యంగ్ మాస్ హీరోగా మంచి ఫాంలో ఉన్న చిరంజీవి లేడీ గెటప్ లో నటించడానికి ఒప్పుకోవడమే.

చంటబ్బాయి సినిమా మరియు చిరంజీవి లేడీ గెటప్

చంటబ్బాయ్ సినిమాలో ఓ పాట సందర్భంగా చిరంజీవి లేడీ గెటప్ లో కనిపించాలి. గౌన్ వేసుకొని, విగ్గు ధరించి నటించాల్సిన ఈ పాత్రకు చిరంజీవి ముందుగా ఒప్పుకున్నా, డైరెక్టర్ ఆయనను మీసాలు తీసేయమని అడిగినప్పుడు చిరంజీవి ఒక ఆసక్తికరమైన కండిషన్ పెట్టాడు.

సెట్లో ఉన్న దాదాపు 70-80 మంది మగవాళ్లు

షూటింగ్ సెట్లో ఉన్న దాదాపు 70-80 మంది మగవాళ్లు అందరూ తమ మీసాలు తీసేస్తేనే తాను కూడా మీసం తీసేస్తానని షరతు పెట్టారట. చిరంజీవి చెప్పిన మాటకు ఓకే చెప్పిన టీమ్ అందరూ మీసాలు తీసేసి సెట్లోకి వచ్చారట. 80 మంది మగవాళ్లు మీసం తీసేయడంతో చిరంజీవి కూడా మీసం తీసేసారట. ఈ విషయాన్నీ విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ఈవెంట్‌లో స్వయంగా మెగాస్టార్ చిరు చెప్పారట.

లేడీ గెటప్ లో చిరంజీవి అద్భుత నటన

లేడీ గెటప్‌లో చిరంజీవి నటనను ప్రేక్షకులు ఎంతోగానో ఆదరించారు. ఆయన హావభావాలు, కామెడీ టైమింగ్ పాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈ గెటప్ కోసం మీసాలు తీసేసిన తర్వాత చిరంజీవిని చూసి ఆయన ఇంట్లో వాళ్లు షాక్‌ అయ్యారట. మీసాలు తిరిగి వచ్చేవరకు మాకు కనిపించొద్దు అన్నారు. అంటూ చెప్పిన ఆసక్తికరమైన విషయాన్ని చిరంజీవే హస్యంగా చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి తన సినీ జీవితంలో లేడీ గెటప్ వేసిన సినిమాలు రెండు మాత్రమే. అవి పట్నం వచ్చిన పతివ్రతలు, చంటబ్బాయి. ఈ రెండు చిత్రాల్లో ఆయన లేడీ గెటప్ లో నటించాడు.

ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చిరు. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతోన్న’విశ్వంభర’ సోషియో ఫాంటసీ చిత్రంగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. చిరు తన తదుపరి చిత్రాన్ని హిట్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడితో చేయడానికి రెడీ అవుతున్నారు.

Related Posts

కోటి రూపాయల చెట్టు..! ఆ చెట్టుకు డార్లింగ్ కు లింక్ ఏమిటి?

Share Tweet Pin Send పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్…

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అదిరే బిజినెస్.. ఏడాదికి కోట్లలలొ లాభం!

Share Tweet Pin Send టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో నెగటివ్ షేడ్స్‌తో ను ప్రారంభించిన సందీప్ కిషన్, తన కష్టంతో నెమ్మదిగా హీరోగా స్థిరపడ్డాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన హిట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *