
పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిన చిత్రం తొలిప్రేమ. ఈ సినిమా అప్పట్లో యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా ప్రేమికుడిగా పవన్ కళ్యాణ్ తన నటనతో యువతలో ఎంతో పాపులర్ అయ్యాడు. ప్రేమను వ్యక్తపరచడంలో తడబాటుతో కనిపించే పాత్రను పవన్ అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన కీర్తి రెడ్డి కూడా ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన కీర్తి రెడ్డి, అదే వేగంతో ఇండస్ట్రీకి దూరమైంది. తొలిప్రేమ తర్వాత ఆమె తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించినా, తర్వాత అక్కినేని హీరో సుమంత్‌తో వివాహం చేసుకుంది. అయితే మనస్పర్థల వల్ల వారికి విడాకులు అయ్యాయి. అనంతరం ఆమె మరోసారి ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇటీవలఇండియాలో జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరైన కీర్తి, సమంత స్నేహితురాలైన ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డితో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు పిల్లలకు తల్లయినా కీర్తి రెడ్డి అందంలో ఏమాత్రం మారలేదు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.