
సుకుమార్ కన్ను బాలీవుడ్(Bollywood) మీద పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ సెంట్రిక్‌గా పాన్ ఇండియా(Pan India) మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట సుక్కు. అందుకోసం ఓ పెద్ద స్టార్‌తో డిస్కషన్స్ నడుస్తున్నాయట. పుష్ప-2 టేకింగ్, సినిమా సక్సెస్‌తో ఆ స్టార్ హీరో సుక్కుతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని Tటౌన్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్(Ram Charan)తో మూవీ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)తో మూవీ చేయబోతున్నాడట సుకుమార్.
లెక్కల మాస్టర్ సుకుమార్(Director Sukumar).. కానీ సినిమా తీయడంలో ఆయన లెక్కే వేరు. తెరపై ఏ హీరోని ఎలా చూపించాలి.. ఎలాంటి గెటప్స్ వేయించాలనే దానిపై ఆయన లెక్కలు ఇతర డైరెక్టర్ల కంటే కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇటీవల పుష్ప-2(Pushpa-2)తో తన మాస్టర్ మైండ్ ఏంటో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నసినీ అభిమానులకు చూపించాడు డైరెక్టర్ సుకుమార్. ఈ మూవీ వసూళ్ల(Collections) పరంగా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో మూవీలకు కాస్త ఇచ్చాడు సుకుమార్. అయితే తాజాగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
అంజామ్ తరహా సైకలాజికల్ యాక్షన్ డ్రామా(A psychological action drama)గా ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సౌత్ ప్లస్ నార్త్ మిక్స్‌డ్ స్టోరీతో మూవీ ఉండబోతోందట. ప్రస్తుతం సుకుమార్ రామ్‌చరణ్ RC17 స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నాడు. చరణ్ బుచ్చిబాబు(Bucchibabu)తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్, చరణ్ కలిసి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. RC17 తర్వాత షారుఖ్‌ఖాన్‌తో సుకుమార్ మూవీ చేస్తారని అంటున్నారు.