
మహాశివరాత్రి(Maha shivaratri) సందర్భంగా రీరిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.. కానీ తేదీ మాత్రం వెల్లడించలేదు. అయితే తాజాగా ఈ మూవీని 4K వెర్షన్‌లో తీసుకువస్తున్నారు. ఏప్రిల్ 11న గ్రాండ్‌గా రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇక ఈ మూవీకి సౌండ్ కూడా 5.1 క్వాలిటీ లోకి కన్వర్ట్ చేశామని.. ప్రసాద్స్ డిజిటల్ టీమ్ 6 నెలల పాటు శ్రమించి చక్కటి అవుట్ పుట్ ఇచ్చారని, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. కాగా వింటేజ్ బాలయ్యను మరోసారి థియేటర్‌లో చూసి నందమూరి ఫ్యాన్స్ సందడి చేయడం పక్కా అని సినీవర్గాలు అంటున్నారు.
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అత్యంత ప్రతిష్ఠాత్మంగా తీసుకుని నటించిన చిత్రం ‘ఆదిత్య 369(Aditya 369)’. ఇది ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్(First Time Travel Science Fiction) మూవీ. దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు(Srinivasa Rao) 1991లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్(Box office) వద్ద బంపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో టైమ్ మెషీన్(Time Machine) ద్వారా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాడు డైరెక్టర్ శ్రీనివాసరావు. అప్పటికీ.. ఇప్పటికీ ఇలాంటి సినిమాలెన్ని వచ్చినా ‘ఆదిత్య 369’ మాత్రం ఎవగ్రీన్‌గా నిలిచింది. ఈ మూవీని శ్రీదేవి మూవీస్(Sridevi Movies) సంస్థ నిర్మించింది. తాజాగా ఈ మూవీని రీరిలీజ్(Rerelease) చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.