
చేతినిండా సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas). ఓవైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ (The Raja Saab).. మరోవైపు హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు. హనుతో చేస్తున్న సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో మరో కథానాయిక కూడా నటించనున్నట్లు సమాచారం. అయితే సెకండ్ లీడ్ కోసం ఇద్దరు భామలను అనుకుంటున్న డైరెక్టర్ అందులో ఒకర్ని ఫైనల్ చేసినట్లు తెలిసింది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండగా.. ఇప్పటికే ఇమాన్వీని ఓకే చేశారు. రెండో రోల్ కోసం మొదట మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) ను తీసుకోవాలని భావించారట. అయితే ఇప్పటికే హను దర్శకత్వంలో మృణాల్ సీతారామంలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం ఫ్రెష్ ఫేస్ కావాలని హను భావించారట. అందుకే బాలీవుడ్ భామ దిశా పటాని వైపు మొగ్గు చూపారట. అయితే దిశా కల్కిలో నటించినప్పటికి ఆమె స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆమెను తీసుకోవాలని హను ఫిక్స్ అయినట్లు తెలిసింది.
తాజాగా హను-ప్రభాస్ సినిమాలో ఓ బాలీవుడ్ బ్యూటీ నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ భామ ఎవరో కాదు.. ప్రభాస్ తో ‘కల్కి 2898ఏడీ’లో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించిన బాలీవుడ్ భామ దిశా పటానీ (Disha patani). ఈ జంట మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రభాస్-హను సినిమా కోసం దిశాను ఓకే చేసినట్లు.. ఆ భామ కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇది ప్రభాస్ – దిశా పటానీ కలిసి చేయనున్న రెండో చిత్రమవుతుంది. దీని తర్వాత వీళ్లిద్దరూ మళ్లీ ‘కల్కి 2898ఏడీ’ (Kalki 2898 AD) సీక్వెల్‌లోనూ సందడి చేసే అవకాశముంది.