
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ‘హను-మాన్ ‘ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘మిరాయ్ (Mirai)’ సినిమాలో నటిస్తున్నాడు. మానవాళికి సవాల్‌గా మారిన ఒక అంతుచిక్కని రహస్యం కోసం సాహసం చేసే యువకుడిగా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయి ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెంచేశాయి. పీపుల్స్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
విలన్ గా మంచు మనోజ్
పీరియాడిక్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన లుక్ కూడా రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత మనోజ్ వెండితెరపై సందడి చేయనున్నాడు. అది కూడా విలన్ పాత్రలో నటించనున్నాడు. ఆయన పాత్ర చాలా ఇంటెన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఇక మిరాయ్ సినిమా ఆగస్టు 1వ తేదీన ప్యాన్ ఇండియా భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మిరాయ్ మూవీలో దగ్గుబాటి రానా
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మిరాయ్ సినిమాలో దగ్గుబాటి రానా (Daggubati Rana) భాగం కాబోతున్నట్లు తెలిసింది. అయితే మొదట ఓ పాత్రకు దుల్కర్ సల్మాన్ ను తీసుకోవాలని భావించిన మేకర్స్ ఆయన డేట్స్ కుదరకపోవడంతో ఆయన స్థానంలో రానాను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆయన ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.