
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర (Vishwambhara)’. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే టీజర్ విడుదలై.. ఈ చిత్రంపై ప్రేక్షకులకు అంచనాలు పెంచేసింది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశ్వంభర చిత్రం కోసం మెగాస్టార్ తన గాత్రం అందించనున్నారట. ఇందులో ఆయన ఏకంగా ఓ పాట పాడనున్నారట.
చిరు పాట పాడితే థియేటర్లో పూనకాలే
ఈ చిత్రానికి అస్కార్ అవార్డ్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే చిరు ఈ మూవీలో ఓ సాంగ్ పాడనున్నారట. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మెగా ఫ్యాన్స్ మాత్రం నెట్టింట ఈ న్యూస్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. మెగాస్టార్ వాయిస్ లో పాట వినేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. చిరు స్టెప్పేస్తేనే థియేటర్లో పూనకాలు పెట్టే ప్రేక్షకులు ఇక ఆయన పాట వింటే ఇక థియేటర్ల దద్దరిల్లిపోవాల్సిందే.
అద్భుతమైన సీజీ వర్క్స్
ముఖ్యంగా మృగరాజు మూవీలో ఛాయ్ గురించి పాడిన పాట ఇప్పటికీ పాపులరే. ఇక ఈ సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తోంది. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ (Kunal Kapoor) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని టాక్. రూ.200 కోట్లతో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.