‘మ్యాడ్ స్వ్కేర్’ సక్సెస్ మీట్.. చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్(Mad Square)’. 2023 అక్టోబరులో విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘మ్యాడ్‌’ (Mad)’ చిత్రానికి సీక్వెల్‌గా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(Director Kalyan Shankar) రూపొందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamsi) ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 28న గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో దూసుపోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్(Success Meet) నిర్వహించేందుకు రెడీ అయ్యారు.

5 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.74 కోట్లు

‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.74 కోట్లు వసూలు చేసినట్లుగా మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే ఈ సినిమా రూ.100 కోట్ల మైల్ స్టోన్ మార్క్‌ను టచ్ చేసే అవకాశం ఉంది. అందుకే నిర్మాతలు గ్రాండ్‌గా సక్సెస్ మీట్ చేయాలని భావిస్తున్నారు. దీనికి మరింత మ్యాడ్ నెస్ యాడ్ చేయడానికి ఏకంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌(Jr. NTR)ను చీఫ్ గెస్టుగా తీసుకురావాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు రేపు (ఏప్రిల్ 4) శిల్పా కళా వేదికలో ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ సెలబ్రేషన్స్(Success Celebrations) ఏర్పాటు చేశారు.

తారక్ రావడం కన్ఫార్మ్

దీనికి ముఖ్య అతిథిగా తారక్ రావడం కన్ఫార్మ్ అయిందని ప్రొడ్యూసర్ నాగవంశీ ట్విటర్(X) వేదికగా ఓ పోస్టర్‌(Poster)ను షేర్ చేశారు. కాగా ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఈ సినిమాలో ఒక హీరోగా నటించారు. గతంలోనూ NTR ‘మ్యాడ్’ ట్రైలర్‌ను లాంచ్ చేసి తన బెస్ట్ విషెస్ అందజేశారు. మరోవైపు నిర్మాత ఎస్.నాగవంశీకి తారక్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌కు “మ్యాన్ ఆఫ్ మాసెస్‌”ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Related Posts

కోటి రూపాయల చెట్టు..! ఆ చెట్టుకు డార్లింగ్ కు లింక్ ఏమిటి?

Share Tweet Pin Send పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్…

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అదిరే బిజినెస్.. ఏడాదికి కోట్లలలొ లాభం!

Share Tweet Pin Send టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో నెగటివ్ షేడ్స్‌తో ను ప్రారంభించిన సందీప్ కిషన్, తన కష్టంతో నెమ్మదిగా హీరోగా స్థిరపడ్డాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన హిట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *