
ప్రస్తుతం టాలీవుడ్(Tollywood)లో పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్(Re-Release Trend) నడుస్తోంది. ఇప్పటికే డజన్ల కొద్దీ సినిమాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. దీంతో ఇటు తమ ఫేవరేట్ హీరో అప్పట్లో థియేటర్లో మిస్ అయ్యామనుకున్న అభిమానులకు.. అటు అప్పట్లో మూవీ టికెట్ల ధరలు తక్కువున్న నేపథ్యంలో అనుకున్న మేర కలెక్షన్లు రాకపోవడంతో మేకర్స్‌కూ ఈ రీరిలీజ్‌లు బాగా వర్కౌట్ అవుతున్నాయి. దీంతో చాలా సినిమాలో మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. తాజాగా మహేశ్ బాబు(Mahesh Babu) నటించిన మూడు సినిమాలు నెల రోజుల వ్యవధిలోనే రీరిలీజ్ కాబోతుండటం చూస్తుంటే ఇదే అనిపిస్తోంది.
‘సైనికుడు’ పై త్వరలోనే క్లారిటీ
ఇంతకీ మహేశ్ బాబు నటించిన ఏ సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయో తెలుసా.. 2007లో వచ్చిన అతిథి(Athidhi), 2010లో విడుదలైన ఖలేజా(Khaleja).. ఇక 2018లో రిలీజ్ అయిన భరత్ అనే నేను(Bharat Ane Nenu).. సినిమాలు మరోసారి థియేటర్లలోకి రానున్నాయి. ఈ మేరకు భరత్ అనే నేను ఏప్రిల్ 26, ఖలేజా మే 30, అతిథి మే 31న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు మే 31న సైనికుడు(Sainikudu) మూవీని కూడా రీరిలీజ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ సమ్మర్ ప్రిన్స్ ఫ్యాన్స్‌కు మూవీ ఫీస్ట్ కానుంది.
మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో..
కాగా ప్రస్తుతం మహేశ్ బాబు దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ(SSMB29)లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది మహేశ్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కిస్తుండగా నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్.. ప్రస్తుతం ఈ చిత్రం అప్పుడే మూడో షెడ్యూల్ లోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. ఈ కొత్త షెడ్యూల్లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది.