
బుల్లిరాజు (Bulliraju) తన నటన, డిక్షన్‌తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. నేను కొరికేస్తాన్.. నేను కొరికేస్తాన్ అంటూ వెంకీతో కలిసి బుల్లిరాజు చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఇక తండ్రిని ఎవరైనా ఒక్క మాట అంటే సహించని కుమారుడిగా, తండ్రి అంటే పిచ్చి ప్రేమ ఉన్న కొడుకుగా బుల్లిరాజ తన నటనతో మెప్పించాడు. అందుకే సినిమా రిలీజ్ అయిన రోజు నుండి బుల్లిరాజుపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది.
https://www.youtube.com/shorts/mlhgTvcAMzQ
తొలి సినిమాతోనే బుల్లిరాజుకి (Bulliraju Remuneration) మంచి పేరు వచ్చింది. పాపులారిటీతో పాటు డిమాండ్ కూడా బాగా పెరిగింది. అందుకే బుల్లిరాజు తన రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్టు సమాచారం. సీనియర్ నటుల రేంజులో బుల్లిరాజు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఒక రోజుకు ఏకంగా లక్ష రూపాయల రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్టులకు ఈ రేంజులో రెమ్యునరేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు.
ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చిన సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇటీవలే బుల్లితెరపై, ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh), ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బుల్లిరాజ పాత్ర ప్రేక్షకులను భలే మెప్పించింది.