‘అతడు’ సరికొత్త రికార్డ్.. TVల్లో 1500 టెలికాస్ట్‌లు

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను సంపాదించుకున్న ఈ హీరో.. మరోసారి హిస్టరీ తిరగరాశాడు. ఆయన నటించిన ‘అతడు(Athadu)’ సినిమా ఏకంగా 1500 సార్లు ‘‘స్టార్ మా టీవీ(Star Maa)’’లో ప్రసారం అయింది. ఇన్నిసార్లు ఏ తెలుగు సినిమా TVలో టెలికాస్ట్ కాలేదు. టాలీవుడ్‌(Tollywood)లో ఇది చెక్కు చెదరని రికార్డు అనే చెప్పాలి. 2005లో రిలీజ్ అయినప్పుడు కూడా ఈ మూవీ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ అప్పట్లో రూ.22 కోట్లు వసూలు చేసింది. దాదాపు 205 సెంటర్లలో 50 రోజులు ఆడగా.. మరో 38 సెంటర్లలో 100 రోజులు నడిచింది. హైదరాబాద్‌(HYD)లోని సుదర్శన్ 35mm థియేటర్‌లో ఏకంగా 175 రోజులు ఆడి, ఆ ఒక్క థియేటర్ నుంచే రూ.1.40 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

మహేష్ బాబుకు జోడీగా త్రిష(Trisha) నటించింది. గిరిబాబు, హేమ, సోనూసూద్, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ తదితరుల నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బ్రహ్మీ-హేమ-త్రిష మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వింస్తుంటాయి. దీంతోపాటు మణిశర్మ మ్యూజిక్ కూడా సినిమాని ఒక టైమ్ లెస్ క్లాసిక్‌గా మార్చేసింది. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) డైరెక్షన్లో ‘SSMB29’లో నటిస్తున్నాడు.

Related Posts

కోటి రూపాయల చెట్టు..! ఆ చెట్టుకు డార్లింగ్ కు లింక్ ఏమిటి?

Share Tweet Pin Send పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్…

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అదిరే బిజినెస్.. ఏడాదికి కోట్లలలొ లాభం!

Share Tweet Pin Send టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో నెగటివ్ షేడ్స్‌తో ను ప్రారంభించిన సందీప్ కిషన్, తన కష్టంతో నెమ్మదిగా హీరోగా స్థిరపడ్డాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన హిట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *