
మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుండగా.. రైతు రుణమాఫీ, గృహజ్యోతి పథకాలపై అధికార, విపక్ష నేతలు వాదోపవాదనలు చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు సంధించిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సమాధానం తమదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతండగానే బీఆర్ఎస్ (BRS) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తమ అధినేత కేసీఆర్ (KCR)పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సీఎం ప్రసంగాన్ని తాము బాయ్‌కాట్ (Boycott) చేస్తున్నట్లుగా తెలిపారు.