సీరియల్స్‌లో డేంజర్ విలన్.. బయట చూస్తే అందాల అరాచకం, ఈ వయ్యారిని గుర్తుపట్టారా?

బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ముప్పుతిప్పలు పెట్టేలా చేస్తోంది ఓ గ్లామర్ బ్యూటీ. టీవీ సీరియళ్లలో నెగటివ్ షేడ్స్ పాత్రల్లో తనదైన ముద్ర వేసిన ఈ నటి.. నిజ జీవితంలో మాత్రం అందంతో అభిమానుల మనసు దోచేస్తోంది.

ప్రేమ ఎంత మధురం సీరియల్ ఫేమ్:
ఇక్కడ కథానాయికే కాదు, కథనాయికను మించిపోయే క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఎవరో కాదు.. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన ‘ప్రేమ ఎంత మధురం’ ఫేమ్ మాన్సీ అలియాస్ మహేశ్వరి. టీవీ సీరియల్స్ లో చీరకట్టులో సింపుల్ లుక్ లో కనిపించే ఈ అమ్మడు.. తాజాగా సోషల్ మీడియాలో తన గ్లామర్ లుక్స్ తో హీటెక్కిస్తోంది. ట్రెడిషనల్ నుంచి మోడ్రన్ అవుట్‌ఫిట్స్ వరకు ఎన్నో ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

విలన్ క్యారెక్టర్‌:
మహేశ్వరి నటించిన ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సీరియల్‌లో ‘అను’, ‘ఆర్య’ల పాత్రలతో పాటు మాన్సీ పోషించిన విలన్ క్యారెక్టర్‌ కూడా విపరీతమైన చర్చకు దారి తీసింది. ఆమె నటన చూసి ప్రేక్షకులు కోపంతో ఉప్పొంగిపోతారు. కానీ అదే ఆమె నటనకు నిదర్శనం.

పక్కా గుంటూరు అమ్మాయి:
పక్కా గుంటూరు అమ్మాయి అయిన మహేశ్వరి, ఇంటర్మీడియట్ చదువుతుండగానే ‘నా కోడలు బంగారం’ సీరియల్ కోసం జరిగిన ఆడిషన్స్‌లో 600 మందిలో ఎంపిక కావడం ఆమె టాలెంట్‌కు నిదర్శనం. అనంతరం ‘రాధమ్మ కూతురు’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందింది.

గ్లామర్ షోతో అటాక్:
తన ముఖంలోని లక్షణాల కారణంగా ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్లే వస్తున్నాయని, అలా నటించడంకోసం నిజ జీవితంలో తిడుతున్నారు కూడా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మహేశ్వరి. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీరకట్టులోనూ, మోడ్రన్ డ్రెస్సుల్లోనూ ఎంతో ఆకర్షణీయంగా మెరిసిపోతూ అభిమానుల మన్ననలు అందుకుంటోంది. విలన్ పాత్రలతోనే కాదు, గ్లామర్ షోతోనూ మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటోంది.

Related Posts

కోటి రూపాయల చెట్టు..! ఆ చెట్టుకు డార్లింగ్ కు లింక్ ఏమిటి?

Share Tweet Pin Send పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్…

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అదిరే బిజినెస్.. ఏడాదికి కోట్లలలొ లాభం!

Share Tweet Pin Send టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో నెగటివ్ షేడ్స్‌తో ను ప్రారంభించిన సందీప్ కిషన్, తన కష్టంతో నెమ్మదిగా హీరోగా స్థిరపడ్డాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన హిట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *