TTD: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూన్ నెల కోటా విడుదల

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల దర్శన భాగ్యం కోసం TTD ఇవాళ (మార్చి 18) జూన్ నెలకు సంబంధించి స్పెషల్ ఎంట్రీ టికెట్ల(Special entry tickets)ను విడుదల చేయనుంది. ఈ మేరకు పలు సేవల టికెట్ల వివరాలకు సంబంధించి టీటీడీ తేదీలను ప్రకటించింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్లను మార్చి 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌(Online)లో విడుదల చేయనున్నారు. ఈ సేవల లక్కీ డిప్(Lucky dip) కోసం మార్చి 18 నుంచి మార్చి 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు మార్చి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

 బుకింగ్ కోసం..

జూన్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మార్చి 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను మార్చి 24న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సందర్శించాలని టీటీడీ సూచించింది.

సేవ టిక్కెట్ల విడుదల ఇలా..అలాగే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం(Arjita Brahmotsavam), సహస్రదీపాలంకరణ సేవా టికెట్ల కోటాను మార్చి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. జూన్ 9 నుంచి 11 వరకు జరిగే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంచుతారు. వర్చువల్ సేవల దర్శన స్లాట్ల(Virtual services visit slots)ను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితోపాటు అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 22న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల(Srivani Trust Tickets)ను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను మార్చి 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

 

Related Posts

TTD కీలక నిర్ణయం.. కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

Share Tweet Pin Send తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రత్యేక ఉత్సవ రోజుల్లో మినహా అన్ని రోజుల్లో ఈ ప్రత్యేక సౌకర్యాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *