
నేచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా తెరకెక్కిన మూవీ ‘కోర్ట్–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ(Court – State Vs A Nobody)’. ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మార్చి 14న హోలీ(Holi) పండగ కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రియదర్శి(Priyadarshi), రోషన్, శ్రీదేవి, శివాజీ(Shivaji) ప్రధాన పాత్రల్లో మెప్పించారు. సాయికుమార్(Saikumar), రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ తేదీ(OTT Release Date)పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
సుమారు రూ.10 కోట్ల బడ్జెట్‌తో..
ఈ మేరకు ‘కోర్ట్’ సినిమా ‘ఏప్రిల్ 11’న విడుదల కానుందని ‘నెట్‌ఫ్లిక్స్'(Netflix) అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమ OTT కమింగ్‌సూన్ బ్లాక్‌లో ఈ సినిమాను చేర్చాంది. అందులోనే స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. సుమారు రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్‌కు పైగానే కలెక్షన్స్(Collections) రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.