
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), తన కెరీర్లో ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను సంపాదించుకున్న ఈ హీరో.. మరోసారి హిస్టరీ తిరగరాశాడు. ఆయన నటించిన ‘అతడు(Athadu)’ సినిమా ఏకంగా 1500 సార్లు ‘‘స్టార్ మా టీవీ(Star Maa)’’లో ప్రసారం అయింది. ఇన్నిసార్లు ఏ తెలుగు సినిమా TVలో టెలికాస్ట్ కాలేదు. టాలీవుడ్(Tollywood)లో ఇది చెక్కు చెదరని రికార్డు అనే చెప్పాలి. 2005లో రిలీజ్ అయినప్పుడు కూడా ఈ మూవీ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ అప్పట్లో రూ.22 కోట్లు వసూలు చేసింది. దాదాపు 205 సెంటర్లలో 50 రోజులు ఆడగా.. మరో 38 సెంటర్లలో 100 రోజులు నడిచింది. హైదరాబాద్(HYD)లోని సుదర్శన్ 35mm థియేటర్లో ఏకంగా 175 రోజులు ఆడి, ఆ ఒక్క థియేటర్ నుంచే రూ.1.40 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.
మహేష్ బాబుకు జోడీగా త్రిష(Trisha) నటించింది. గిరిబాబు, హేమ, సోనూసూద్, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ తదితరుల నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బ్రహ్మీ-హేమ-త్రిష మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వింస్తుంటాయి. దీంతోపాటు మణిశర్మ మ్యూజిక్ కూడా సినిమాని ఒక టైమ్ లెస్ క్లాసిక్‌గా మార్చేసింది. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) డైరెక్షన్లో ‘SSMB29’లో నటిస్తున్నాడు.