
జూనియర్ ఎన్టీఆర్ 1996లో బాలనటుడిగా ‘బాలరామాయణం సినిమాతో ప్రారంభమై, 2001లో వచ్చిన ‘నిన్ను చూడలని’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తారక్. దర్శకుడు రాజమౌళితో తొలి కాంబినేషన్ ‘స్టూడెంట్ నెం.1’తో గ్రాండ్ సక్సెస్ ను అందుకున్నాడు.
ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ, బృందావనం, జనతా గ్యారేజ్, అరవింద సమేత వంటి సినిమాల ద్వారా గొప్ప నటుడిగా ఎదిగాడు. అంతేకాదు యాక్టర్‌గా, డాన్సర్‌గా నిరూపించుకున్న ఎన్టీఆర్ సింగర్‌గా కూడా తన సత్తా చూపించాడు. పలు సినిమాల్లో తనే స్వయంగా పాటలు పాడాడు.
ఎన్టీఆర్ మొదటిసారిగా గాయకుడిగా 2007లో విడుదలైన యమదొంగ సినిమాలో ఓలమ్మి తిక్క రేగిందా అంటూ పాడిన పాటకి ఎం.ఎం. కీరవాణికి సంగీతం అందించారు. ఈ పాట సూపర్ హిట్ అయింది. 2008లో వచ్చిన కంత్రి సినిమాలో తారక్ పాడిన “1 2 3 నేనొక కంత్రి…” పాట యువతలో ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు.
2010లో అదుర్స్ సినిమాలో డీఎస్పీ మ్యూజిక్‌కు తారక్ “చారీ… ” పాటగా మారింది. తర్వాత ఊసరవెల్లిలో “శ్రీ ఆంజనేయం..”, నాన్నకు ప్రేమతో సినిమాలో “ఫాలో ఫాలో…”, రభస సినిమాలో “రాకాసి రాకాసి…” వంటి పాటలకు ఎన్టీఆర్ తన స్వరాన్ని అందించాడు. తారక్ పాడిన ప్రతి పాట ఓ సూపర్ హిట్‌గా నిలిచింది.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన RRR మూవీ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా తారక్‌కు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువచ్చింది. కొమురం భీమ్ పాత్రలో తారక్ చూపిన నటన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఎనర్జీ, ఎమోషన్, డెడికేషన్ అన్నింటిలోనూ అద్భుతంగా కనిపించాడు. ప్రత్యేకంగా జపాన్ లో విపరీతమైన ఫాన్స్ ను సంపాదించుకున్నాడు తారక్.
ప్రస్తుతం ఎన్టీఆర్, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం వార్2లో నటిస్తున్నాడు . హృతిక్ రోషన్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. వార్2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ సినిమాలో నటించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కాబోతుంది.