
సభలో కేసీఆర్ ప్రసంగాని(KCR Speech)కి ముందు, పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడి ఉండాల్సిందని కవిత అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచిన నాయకులు, ధూంధాం కార్యకర్తలు ప్రసంగించి ఉంటే.. అది శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సభ ద్వారా కార్యకర్తలను పూర్తిగా ఆకట్టుకోవడంలో పార్టీ విఫలమైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ(Letter) సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ లేఖలోని అంశాలు BRS పార్టీ అంతర్గత పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై అనేక ఊహాగానాలకు తావిస్తున్నాయి. అయితే.. ఈ లేఖ ప్రామాణికతపై కవిత ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మే రెండో తేదీన ఆరు పేజీల్లో రాసినట్లు ఉన్న ఈ వైరల్ లేఖలో కవిత.. వరంగల్(Warangal)లో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహణ తీరుపై తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది.
సీక్రెట్ డీల్ ఉందా?
“నన్ను జైలుకు పంపిన BJPని ఎందుకు నిలదీయలేకపోతున్నారు డాడీ?” ఈ ప్రశ్నే ఇప్పుడు BRS వర్గాల్లో పోలిటికల్ బాంబు పేల్చింది. బీజేపీ పాలిట నిప్పు అయిన కవిత.. తండ్రి కేసీఆర్ బీజేపీపై నోరు జారకపోవడం చూసి సహించలేక, “ఇది న్యాయమా?” అని ప్రశ్నించేసింది. ఇది కేవలం ప్రశ్న కాదు ఇది నేరుగా కేసీఆర్‌కి నిలదీసింది. వరంగల్ సభలో బీజేపీపై కేసీఆర్ గళమెత్తకపోవడాన్ని టార్గెట్ చేస్తూ… “ఇలాంటివి చూస్తే… మీకు ఏదైనా సీక్రెట్ డీల్ ఉందా డాడీ?” అన్నట్లుగా కవిత లేఖలో బాణాలు వదిలారు. అయితే పార్టీ బలోపేతం కోసం కేసీఆర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన విషయాలను కవిత లేఖ రూపంలో రాయాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న సైతం తలెత్తుతోంది. ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.