Akhanda2: బాలయ్య ‘అఖండ-2’ మూవీ రిలీజ్ డేట్ తెలుసా?

నటసింహం బాలకృష్ణ(Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ(Akhanda)’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇదే జోష్‌లో వీరిద్దరూ ‘అఖండ-2(Akhanda2)’ మొదలెట్టేశారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మిగతా షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తోంది BB4 టీమ్.. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), కావ్యా థాపర్, జగపతి బాబు, ఎస్.జే. సూర్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బాలయ్య-బోయపాటి ప్లాన్ అదేనా..

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ విడుదల తేదీ(Release Date) మారినట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం సెప్టెంబర్ 25కి థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ ఆ సమయానికి షూటింగ్, VFX తదితర పనులు పూర్తయ్యే ఛాన్స్ లేదట. పైగా ఫెస్టివల్ సీజన్ కావడంతో కలెక్షన్ల పరంగానూ మూవీకి బెనిఫిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో ఈ మూవీని 2026 సంక్రాంతి(Sankranthi 2026)కి బరిలో నిలపాలని బాలయ్య-బోయపాటి కాంబో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో

ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య బాబు ‘అఖండ 2’కు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బాలకృష్ణను పవర్ ఫుల్ పాత్రకోసం రెడీ చేస్తున్నట్లు కనిపించింది. కాగా దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్(SS Thaman) మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని(Tejaswini) సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది.

Related Posts

కోటి రూపాయల చెట్టు..! ఆ చెట్టుకు డార్లింగ్ కు లింక్ ఏమిటి?

Share Tweet Pin Send పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్…

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అదిరే బిజినెస్.. ఏడాదికి కోట్లలలొ లాభం!

Share Tweet Pin Send టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో నెగటివ్ షేడ్స్‌తో ను ప్రారంభించిన సందీప్ కిషన్, తన కష్టంతో నెమ్మదిగా హీరోగా స్థిరపడ్డాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన హిట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *