
ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన శైలి, విజువల్స్, ఎమోషనల్ డెప్త్ తో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ధీరుడు జక్కన్న.
ఈయన పేరు వినగానే ప్రేక్షకుల మనసులో బాహుబలి, మగధీర, ఈగ వంటి సినిమాలే గుర్తుకొస్తాయి. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన మగధీర సినిమా సినీ పరిశ్రమలో భారీ విజయం సాధించిన చిత్రాలలో ఒకటి. ఈ సినిమా అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. మగధీరకు రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును, ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ డైరెక్టర్‌గా మారారు రాజమౌళి.
అయితే దర్శకునిగా సినిమాల్లోకి రాకముందు పలు టెలివిజన్ సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు రాజమౌళి. ఈ విషయం చాలామందికి తెలియదు. అదే అనుభవంతో 2001లో ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో సినీ దర్శకుడిగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ క్రియేట్ చేయని రికార్డ్ ట్రాక్ సెట్ చేశాడు జక్కన్న.
ఇక చాలా మందికి తెలియని మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రాజమౌళి బాల నటుడిగానూ ఒకప్పుడు వెండితెరపై కనిపించాడు. 1983లో వచ్చిన ‘పిల్లనగ్రోవి’ అనే చిత్రంలో 10 సంవత్సరాల వయసులో రాజమౌళి బాల నటుడిగా కనిపించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు. అందుకే ఆయన నటించిన విషయం వెలుగులోకి రాలేదు. జక్కన్న నటుడిగా మళ్లీ నాని హీరోగా నటించిన ‘మజ్ను’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా ‘రెయిన్ బో’ అనే చిత్రంలోనూ కనిపించారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం (RRR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన ఈ విజువల్ గ్లోబల్ సెన్సేషన్‌గా నిలిచింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో మరో భారీ సినిమా చేస్తున్నారు. SSMB29 పేరుతో ఈ సినిమా రూపొందుతోంది.