Urvashi Rautela: ఆలయంపై ఆమె ఉద్దేశం అది కాదు.. ఊర్వశీ టీమ్ క్లారిటీ

ఒకవైపు బాలీవుడ్‌(Bollywood)తో పాటు మరోవైపు టాలీవుడ్‌(Tollywood)లో కూడా ఫుల్ పాప్యులర్ అయిన నటి ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూ(Interview)లో తన పేరుపై ఉన్న ఆలయం గురించి చేసిన వ్యాఖ్యలు(Comments) తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై టీమ్‌ క్లారిటీ(Clarity) ఇచ్చింది. ఆమె వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది. ఈమేరకు ఇన్‌స్టాలో పోస్ట్‌లో వివరణ ఇచ్చింది.

‘‘ఊర్వశీ ఆ వీడియో(Video)లో మాట్లాడుతూ.. తన పేరు మీద ఆలయం ఉందని చెప్పారు. అది తన ఆలయం అని చెప్పలేదు. అందరూ ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. దయచేసి వీడియో మరోసారి విని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఢిల్లీ యూనివర్సిటీ(Delhi University)లో నిజంగానే ఆమె ఫొటో(Photo)కు దండలు వేసి పూజిస్తారు. దీనిపై గతంలోనూ కథనాలు వచ్చాయి. అవి ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. నిరాధారమైన ఆరోపణలు, అవమానకరమైన వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలి’’ అని టీమ్‌ పేర్కొంది.

ఇంతకీ ఏమైందంటే..

ఓ ఇంటర్వ్యూలో ఊర్వశీ మాట్లాడుతూ.. ‘నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి(Urvashi Rautela Mandir)’ అని అన్నారు. ఈ కామెంట్స్‌పై బద్రీనాథ్‌ సమీపంలోని ఆలయాల అర్చకులు మండిపడుతున్నారు. నటి ఊర్వశీ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు.

Related Posts

కోటి రూపాయల చెట్టు..! ఆ చెట్టుకు డార్లింగ్ కు లింక్ ఏమిటి?

Share Tweet Pin Send పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్…

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అదిరే బిజినెస్.. ఏడాదికి కోట్లలలొ లాభం!

Share Tweet Pin Send టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో నెగటివ్ షేడ్స్‌తో ను ప్రారంభించిన సందీప్ కిషన్, తన కష్టంతో నెమ్మదిగా హీరోగా స్థిరపడ్డాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన హిట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *