విష్ణు మంచు కుమార్తెలు పాడిన ‘కన్నప్ప’ సాంగ్ ప్రేక్షకుల ముందుకు

భక్తికి గొప్ప స్థానం ఇచ్చే కథా ఆధారంగా చేసుకుని రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా, శ్రీశైలానికి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగిన త్యాగ ఘట్టాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతోంది. క్షత్రియుడిగా జన్మించి, శివభక్తుడిగా మారిన ‘కన్నప్ప’ జీవిత గాధను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు.

విజువల్స్ పరంగా ఈ చిత్రం అత్యున్నత స్థాయి విలువలతో రూపొందుతోంది. టైటిల్ పాత్రలో విష్ణు మంచు నటిస్తుండగా, నిర్మాతగా మోహన్ బాబు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది ముకేశ్ కుమార్ సింగ్ కాగా సంగీతాన్ని స్టీఫెన్ దేవసీ అందిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, టాలీవుడ్ రిబెల్ స్టార్ ప్రభాస్ వంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్టులో భాగమవడం సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా ‘శ్రీకాళహస్తి’ అనే లిరికల్ వీడియోను మే 28న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే, విష్ణు మంచు కుమార్తెలు అరియానా మంచు మరియు వివియానా మంచు తమ గాత్రంతో ఈ గీతాన్ని ఆలపించారు. ఇంతకు ముందు ‘జిన్నాా చిత్రంలో కూడా వారు ఓ పాట పాడారు.

శివునిపై అంకితమైన ఈ గీతం, శ్రీకాళహస్తి త్యాగగాథను హృదయాలను తాకేలా చెబుతుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ఈ పాట ఫ్యామిలీ ఎమోషన్, సంగీతం, భక్తిని కలబోసిన ఓ ఆధ్యాత్మిక అనుభూతిగా ఉండనుంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో అరియానా, వివియానా ఇద్దరూ పూల తోటలో ప్రాచీన వేషధారణలో పరుగులు తీయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, వారిద్దరి పాత్రలు సినిమాలో ఉంటాయా? లేక పాట కోసం మాత్రమే ప్రత్యేకంగా కనిపించనున్నారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ భక్తిరస చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘కన్నప్ప’అనే ఈ చిత్రాన్ని ఓ భక్తి యాత్రలా తీర్చిదిద్దే ప్రయత్నం చిత్ర బృందం చేస్తోంది. ఈ గాథను ప్రేక్షకులు ఎంతవరకూ హృదయపూర్వకంగా స్వీకరిస్తారో చూడాలి.

Related Posts

కోటి రూపాయల చెట్టు..! ఆ చెట్టుకు డార్లింగ్ కు లింక్ ఏమిటి?

Share Tweet Pin Send పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్…

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అదిరే బిజినెస్.. ఏడాదికి కోట్లలలొ లాభం!

Share Tweet Pin Send టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో నెగటివ్ షేడ్స్‌తో ను ప్రారంభించిన సందీప్ కిషన్, తన కష్టంతో నెమ్మదిగా హీరోగా స్థిరపడ్డాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన హిట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *